👉KVS Recruitment Notification: హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నంబర్ 1, నంబర్ 2 నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయింది. పార్ట్ టైమ్ ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 19,2026
👉2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
👉ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
👉అభ్యర్థి విద్యా అర్హతలతో పాటు పని చేసిన అనుభవాన్ని పరగణనలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
👉రామాంతపూర్ రోడ్డ వైపు ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వేదికగా టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. వీటిల్లో ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్) ఉన్నాయి. తెలుగు టీచర్ (రీజినల్ లాంగ్వేజ్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, డ్యాన్స్ కోచ్, వోకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ (అథ్లెటిక్స్/కబడ్డీ/ఖో-ఖో/ తైక్వాండో), యోగా ఇన్‌స్ట్రక్టర్ పోస్టులున్నాయి. ఉదయం 9 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
👉ఉప్పల్ లో ఉన్న మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉంటే కేంద్రీయ విద్యాలయం వేదికగా పీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
👉ఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి.
👉పూర్తి వివరాలు వెబ్సైటు లో చూడగలరు.
👉Website: https://no1uppal.kvs.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: