Type Here to Get Search Results !

ECIL: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.



👉ECIL Recruitment Notification: హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు.

👉కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

👉ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది.

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీస పని అనుభవం ఉంటే ఇంకా మంచిది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రాజెక్ట్ నిర్వహణలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయస్సులో రాయితీ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాలి.

👉శాలరీ : నెలకు రూ. 25,000 నుండి రూ.31,000/- వరకు వేతనం అందుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే తుది ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

👉ఇంటర్వ్యూ తేది: ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు తదితర సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్ళాలి.

👉ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్ లెర్నింగ్ & డెవలప్‌మెంట్ సెంటర్ (CLDC), నలంద కాంప్లెక్స్, ఈసీఐఎల్, హైదరాబాద్ - 500062.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments