👉Bank of Maharashtra Recruitment Notification: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) జనరలిస్ట్ బ్యా ఆఫీసర్(స్కేల్- II) పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 500
జనరలిస్ట్ (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడబ్ల్యూఎస్ 50, అన్ రిజర్వ్ డ్ 203, పీడబ్ల్యూబీడీ 15).
👉అర్హత : జనరల్ అభ్యర్థులు అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు అయితే 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉతీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు: కనిష్ట వయోపరిమితి 22 ఏండ్లు, గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : అన్ రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1180. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.118/-
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : మొదట ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ లో ప్రతిభకనబర్చిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్కు 150 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. వీటిని 75: 25 (ఆన్ లైన్ ఎగ్జామ్: ఇంటర్వ్యూ) కింద కన్వర్ట్ చేసి ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్ 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులు 45 శాతం మార్కులు కనీస అర్హతగా నిర్ణయించారు. ఒకవేళ అప్లికేషన్ల సంఖ్య తక్కువగా ఉంటే ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉పరీక్ష విధానం :
ఆన్లైన్ టెస్టులో మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు వేర్వేరు సమయం కేటాయిస్తారు. సెక్షన్-1లో జనరల్ ఇంగ్లిష్ 20 ప్రశ్నలు 20 మార్కులకు (20 నిమిషాల సమయం), సెక్షన్-2లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు(20 నిమిషాల సమయం), సెక్షన్-3లో రీజనింగ్ ఎబిలిటీ 20 ప్రశ్నలు, 20 మార్కులకు(20 నిమిషాల సమయం), సెక్షన్-4లో ప్రొఫెషనల్ నాలెడ్జ్ 90 ప్రశ్నలకు 90 మార్కులకు (60 నిమిషాల సమయం) ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నా యి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఎలాంటి సమాధానం గుర్తించకుండా ఖాళీగా విడిచి పెట్టే ప్రశ్నలకు మార్కుల కోత ఉండదు.
👉Website: bankofmaharashtra.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: