Type Here to Get Search Results !

AIIMS: ఎయిమ్స్ లో 3500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AIIMS Recruitment Notification 2025: దేశవ్యాప్తంగా ఉన్న ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS )ల్లో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్( Nursing Officer ) పోస్టులు భర్తీచేయనున్నారు.

👉పోస్టులు :నర్సింగ్ ఆఫీసర్

👉మొత్తం ఖాళీలు:3500

👉అర్హత : బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం డిప్లొమాతో పాటు రెండేండ్ల పని అనుభవం ఉండాలి. లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికెట్/పోస్ట్ బేసిక్) బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టర్ అయి ఉండాలి.

👉వయస్సు:18నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు, ఎక్స్సర్వీస్మెన్లకు ఐదేండ్ల సడలింపు ఉంటుంది.
 
👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్వోఆర్ సెట్)-09

➡️ఇది రెండు దశల్లో జరుగుతుంది. 
▪️స్టేజ్-1 ఇది క్వాలిఫైయింగ్ పరీక్ష, దీనిలో అర్హత సాధించిన వారికి స్టేజ్-2కు ఎంపిక చేస్తారు. ఇది 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కులు కోతవిధిస్తారు

▪️స్టేజ్-2: ఈ పరీక్ష 160 మార్కులకు ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు. దీనిలో నర్సింగ్ సబ్జెక్టుపై ప్రశ్నలు ఇస్తారు.

👉 నోట్: స్టేజ్-1,2 సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.

👉దరఖాస్తులకు చివరితేదీ :ఆగస్టు 11, 2025

👉సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేదీ :సెప్టెంబర్ 14,2025

👉సీబీటీ మెయిన్ పరీక్ష తేదీ :సెప్టెంబర్ 27,2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments