Type Here to Get Search Results !

SSC: ఇంటర్ అర్హతతో 3,712 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉SSC Recruitment Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 3,712 

👉పోస్టులు : లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ)/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటాఎంట్రీ ఆపరేటర్, డేటాఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ పోస్టులు ఉన్నాయి.

👉అర్హత: ఆగస్ట్ 1, 2024 నాటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత ఉండాలి. కన్స్యమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లలో పోస్ట్లకు మాత్రం ఇంటర్మీడియెట్లో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి.

👉వయసు: ఆగస్ట్ 1, 2024 నాటికి 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.

👉శాలరీ :
▪️ ఆయా పోస్ట్లకు పే లెవల్-2, 4, 5లతో ప్రారంభ వేతనం లభిస్తుంది.

▪️ ఎల్డీసీ/జేఎస్ఏలకు పే లెవల్-2 (వేతన శ్రేణి రూ . 19,900 నుంచి రూ.63,200);  
▪️డేటాఎంట్రీ ఆపరేటర్ / డేటా ఎంట్రీ  ఆపరేటర్ గ్రేడ్-ఎకు పే లెవల్-4(వేతన శ్రేణి రూ .25,500 నుంచి రూ.81,100), 
▪️అదేవిధంగా కొన్ని శాఖల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్కు పే లెవల్-5(వేతన శ్రేణి రూ.29,200 నుంచి రూ.92,300)తో ప్రారంభ వేతనం లభిస్తుంది.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం : 
సీహెచ్ఎస్ఎల్ ద్వారా పలు శాఖల్లో ఎల్డీసీ/జేఎస్ఏ/ డేటాఎంట్రీ ఆపరేటర్, డేటాఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ పోస్ట్ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. టైర్-1, టైర్-2 పేరుతో రాత పరీక్షలు ఉంటాయి. అదే విధంగా టైర్-2 దశలో స్కిల్ టెస్ట్ను నిర్వహిస్తారు.

👉టైర్-1 పరీక్ష :
▪️ఎంపిక ప్రక్రియలో తొలిదశ టైర్-1 పరీక్ష.. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో, బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులకు ఉంటాయి. పరీక్ష ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం ఒక గంట. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు.

👉రెండో దశ పరీక్ష టైర్-2:
▪️తొలిదశ టైర్-1 పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ నిబంధనల ప్రకారం-మెరిట్ జాబితా రూపొందిస్తారు. అందులో నిలిచిన వారికి రెండో దశ.. టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు సెషన్లు, మూడు సెక్షన్లు, ప్రతి సెక్షన్లో రెండు మాడ్యూల్స్ విధానంలో జరుగుతుంది.

👉స్కిల్ టెస్ట్.. 2 మాడ్యూల్స్
▪️టైర్-2 సెషన్-3 మాడ్యూల్-2లో పేర్కొన్న స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ను పార్ట్-ఎ, పార్ట్-బిలుగా విభజించారు. పార్ట్-ఎ ప్రకారం-డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ల అభ్యర్థులకు 15 నిమిషాల వ్యవధిలో స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పార్ట్-బి ప్రకారం-ఎల్డీసీ, జేఎస్ఏ పోస్ట్ల అభ్యర్థులకు పది నిమిషాల వ్యవధిలో టైపింగ్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ మినహా మిగతా విభాగాల్లోని ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లకు నిర్వహించే స్కిల్ టెస్ట్లో గంటకు 8000 క్యారెక్టర్స్ను కంప్యూటర్పై టైప్ చేయాల్సి ఉంటుంది. ఎల్డీసీ, జేఎస్ఏ పోస్ట్లకు నిర్వహించే టైపింగ్ టెస్ట్లో.. ఇంగ్లిష్ టైపింగ్ నిమిషానికి 35 పదాలు, హిందీ టైపింగ్లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాల్సి ఉంటుంది. డేటాఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ల అభ్యర్థులకు ఏదైనా ఒక ఇంగ్లిష్ ప్యాసేజ్ ని ఇచ్చి కంప్యూటర్పై టైప్ చేయమని అడుగుతారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమ టైపింగ్ టెస్ట్ మీడియంను పేర్కొనాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు చివరితేదీ: మే 7, 2024

👉టైర్-1(పేపర్-1) పరీక్ష తేదీలు: జూలై 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11, 12 తేదీలలో జరుగును.

👉Websitehttps://ssc.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments