Type Here to Get Search Results !

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీ..వాటి పూర్తి వివరాలు...

👉హైదరాబాద్: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఈనెల ఏప్రిల్ 23న పేరు నమోదు, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.

👉జర్మనీకి చెందిన ఫెడరల్ ఎంప్లామెంట్ ఏజెన్సీ భాగస్వామ్యంతో అక్కడి బాషలో శిక్షణ ఇచ్చి, అనంతరం వారికి ఆ దేశంలోని నర్సు ఉద్యోగాల్లో అవకాశం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. 

👉రాష్ట్రంలోని గుర్తింపు కాలేజిల్లో బీఎస్సీ నర్సింగ్ చేసి, 21 నుంచి 38 సంవత్సరాల వయస్సుగలవారు ఉద్యోగాలకు అర్హులని తెలిపారు.

👉 అలాగే ఐసీయూలో రెండు నుంచి మూడేండ్లు పని చేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు.

👉 మరిన్ని వివరాలకు 9908830438, 8919047600, 7032379066 ఈ ఫోన్ నంబర్స్ ని సంప్రదించాలని సూచించారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments