👉 తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్ కింద జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం లక్ష్యంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది.
👉ఈ కార్యక్రమం జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ (BA), జర్మన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (GIZ) సమన్వయంతో నిర్వహించనున్నారు.
👉 ఈ నేపథ్యంలో నర్సింగ్ ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థులకు ఓ క్లారిటీ ఇవ్వడం.. విదేశీ అవకాశాలపై వివరణలు ఇచ్చేందుకు TOMCOM మార్చి 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మినీ ఆడిటోరియం, గాంధీ మెడికల్ కాలేజీ, ముషీరాబాద్ లో అవగాహన కార్యక్రమం, ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నారు.
👉21 నుండి 38 సంవత్సరాల వయస్సు ఉన్న B.Sc (నర్సింగ్), GNM అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు భాషా ప్రావీణ్యంలో రెసిడెన్షియల్ శిక్షణ పొందుతారు.
👉సంబంధిత రంగంలో రాణించడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. TOMCOM ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వారి రెజ్యూమ్, సంబంధిత డాక్యుమెంట్లతో డ్రైవ్ కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నారు.
👉 పూర్తి వివరాలు కు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.👉9908830438 / 6302292450 / 8919047600 / 790129 0580
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: