👉Railway Jobs: రైల్వే స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
👉అర్హత : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు గుర్తింపు పొందిన ఒక సంస్థ నుండి బిఎస్సి నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్ వైపరీ లో మూడు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి ఉండాలి. ఎవరైతే వీటన్నిటిని పూర్తి చేసి ఉంటారో వారు భారతీయ రైల్వేలో స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి అర్హులవుతారు.
👉వయస్సు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునే వారికి కనిష్టంగా 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు రూ.500 పీస్ చెల్లించాల్సి ఉంటుంది. OBC, SC, ST, EX- Servicemen, PWBD, మహిళలు లింగ మార్పిడి, మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తయిన తర్వాత రిజర్వుడ్ కేటగిరికి చెందినవారికి 250 రిఫండ్ చేయబడుతుంది.
👉 పూర్తి వివరాలు ఈ క్రింద పిక్చర్ చూడగలరు:
👉ఎంపిక విధానం : స్టాఫ్ నర్స్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మొదటి కంప్యూటర్ ఆధారీత పరీక్ష. రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్.అయితే కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఇది పూర్తయిన తర్వాత తొలి ఎంపిక జాబితాను విడుదల చేస్తారు.
👉పరీక్ష విధానం : భారత రైల్వేలో స్టాఫ్ నర్స్ పోస్టు రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు. ఇక దీనిలో ఒకేషనల్, జనరల్ ఆప్టిట్యూడ్, జనరల్ అర్థమెటిక్ జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. ఇక ఈ పరీక్షలో మైనస్ మార్క్ కూడా ఉంటాయి, ప్రతి ప్రశ్నకు ఒక 1 మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి 1/4 మార్క్ కట్ చేస్తారు.
👉Website : https://indianrailways.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: