👉APPSC 2023: ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది.
👉జోన్ల వారీగా ఖాళీలను చూస్తే..
▪️జోన్ 1 లో 7,జోన్ 2 లో 12,
జోన్ 3లో 8, జోన్ 4లో 11 ఖాళీలున్నాయి.
👉అర్హతలు : ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లో బీఈడీ
ఉత్తీర్ణతతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.
👉 వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.370 కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
👉 ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉శాలరీ : 61,960/- నుంచి 1,51,370/- వరకు ఉంటుంది.
👉 పరీక్ష విధానం: స్క్రీనింగ్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష రాసేందుకు 150 నిమిషాలు (2.30 గంటలు) సమయం ఇస్తారు.
👉మెయిన్స్ పరీక్ష మొత్తం 3 పేపర్లకు ఉంటుంది.
▪️పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150/150,
▪️పేపర్ 2లో ఎడ్యుకేషన్ 1 సబ్జెక్ట్ లో 150/150,
▪️ పేపర్ 3లో ఎడ్యుకేషన్ 2 సబ్జెక్టులో 150/150 మార్కులు ఉంటాయి.
👉 ఏప్రిల్ 13న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జనవరి 9, 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: