👉Anganwadi jobs: అంగన్వాడీ లో ఉద్యోగాలు..
👉పార్వతీపురం ఐసీడీఎస్ పరిధిలో..అంగన్వాడీ కార్యకర్తలు - 07, అంగన్వాడీ సహాయకులు -19, మినీ అంగన్వాడీ - 08 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీఓ ఎంఎన్ రాణి సోమవారం తెలిపారు.
👉పార్వతీపురం డివిజన్ లో కొమరాడ ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త, ఐదు సహాయకులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టుకోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
👉అలాగే పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త, రెండు అంగన్వాడీ సహాయకులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టులు, పాచిపెంట ప్రాజెక్టు పరిధిలో మూడు అంగన్వాడీ కార్యకర్త, ఆరు అంగన్వాడీ సహాయకులు, నాలుగు మినీ అంగన్వాడీ పోస్టులు, సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ సహాయకురాలి పోస్టు, ఒక మినీ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు.
👉పాలకొండ డివిజన్లోని కురుపాం ప్రాజెక్టు పరిధిలో రెండు అంగన్వాడీ కార్యకర్తలు, నాలుగు అంగన్వాడీ సహాయక పోస్టులు, ఒక మినీ అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 21 నుంచి 35ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈనెల 6 నుంచి 14వ తేదీ సాయంత్రం లోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: