Type Here to Get Search Results !

నిరుద్యోగులకు శుభవార్త.. Friday ఏపీ లో మెగా జాబ్ మేళా...


👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉విశాఖపట్నం కంచరపాలెంలో ఉన్న గవర్నమెంట్ ఐటిఐ నందు నవంబర్ 3వ తేదీన జాబ్ మేళా నిర్వహించున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి సాయి కృష్ణ చైతన్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

👉నవంబర్ 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు 200 పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.

👉ఈ జాబ్ మేళా లో టెక్విస్సేన్ సాఫ్ట్వేర్, డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్, యోకోహమా టైర్స్, రావోల్స్ ఇండస్ట్రీస్, ఎస్.ఆర్. షాపింగ్ మాల్ పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తాయని తెలిపారు.
◾టెక్విస్సేన్ సాఫ్ట్వేర్లో ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత అయిన 25 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు.

👉 ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం గంభీరంలో వర్క్ లొకేషన్ ఉంటుందని, నెలకు రూ. 16000 నుండి రూ. 20000 వరకు జీతం ఉంటుందని తెలిపారు.

👉 అలాగే డాక్టర్ రెడ్డీస్ లేబరోటరీస్ లో డిప్లొమా లేదా బీటెక్ లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్సుమెంటేషన్, కెమికల్ మరియు ఎంఎస్సిమైక్రో బయాలజీ లేదా బయో టెక్నాలజీ లలో 2022 మరియు 2023 అకాడమిక్ సంవత్సరంలో ఉత్తీర్ణత అయి ఎటువంటి ఎడ్యుకేషనల్ గ్యాప్స్ లేకుండా పదవతరగతి నుండి కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు హాజరుకావొచ్చని తెలిపారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులు చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments