Type Here to Get Search Results !

ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాలు.. పోస్టుల సంఖ్య శాఖల వారిగా వివరాలు...

👉APPSC :మొత్తం 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఏపీపీఎస్సీకి ఆర్థికశాఖ అనుమతి...

👉ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించే యోచన...

👉ఆగస్టులోనే 508 పోస్టుల భర్తీకి అనుమతి.. తాజాగా మరో 212 పోస్టులు భర్తీ..

👉గత నోటిఫికేషన్లోవి, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 230 కూడా భర్తీ..

👉వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈమేరకు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వతేదీన 508 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెస్ఆర్) చిరంజీవి చౌదరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

👉దీంతోపాటు గత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొంది చేరని పోస్టులు, క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. తద్వారా గ్రూప్-2 కింద దాదాపు 950 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. మరో పది రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ నిర్వహించాలని సర్వీస్ కమిషన్ యోచిస్తోంది.

👉 శాఖల వారీగా పోస్టుల సంఖ్య వాటి వివరాలు:
👉గతంలో అనుమతినిచ్చిన పోస్టులతో పాటు వీలైనంత ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలని స్పష్టం చేయడంతో తాజాగా గ్రూప్ 2 విభాగంలో 212 పోస్టులకు అనుమతి ఇచ్చారు. ఆయా శాఖల నుంచి పోస్టుల ఖాళీలను నిర్దారించుకున్న వెంటనే భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సర్వీస్ కమిషన్కు ఉత్తర్వుల్లో సూచించారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments