👉తెలంగాణ ప్రభుత్వం లో సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
👉టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ని ఇప్పటికే ప్రకటించింది. ఇవాల్టి నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 27వ తేదీన పరీక్ష ఫలితాలను ప్రకటించనున్నారు.
👉ఎగ్జామ్ హాల్లోకి హాల్ టికెట్ తప్ప.. ఇతర వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వివరాలను సరి చూసుకోవాలి. హాల్టికెట్పై ఫొటో, సిగ్నేచర్ సరిగ్గా లేకపోతే అభ్యర్థులు.. ఫొటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని, ఆధార్ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో అనుమతి అనంతరమే పరీక్షకు పర్మిషన్ ఇవ్వడంలో తగు నిర్ణయం తీసుకుంటారు. పరీక్షకు గంట ముందే హాల్లోకి అనుమతి ఇస్తారు.
👉మొదటి పేపర్ పరీక్షకు సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత మాత్రమే బయటికి పంపిస్తారు. సాయంత్రం పరీక్షకు సంబంధించి 5 తర్వాత మాత్రమే హాల్ నుంచి బయటికి అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.
👉టెట్ పేపర్ -1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు.
👉పేపర్ -2 ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు.
👉ఈ పరీక్ష కోసం 2,83,620 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు.
▪️ ఇందులో పేపర్-1 కు 80,990..
▪️ పేపర్-2కు 20,370 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు.
▪️మొత్తం రెండు పేపర్లకు కలిపి 1,82,260 దరఖాస్తులు వచ్చాయి.
👉Website :https://tstet.cgg.gov.in/
( ఈ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు)
👉 పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: