👉SBI Recruitment Notification 2023:
👉స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6160 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఖాళీల వివరాలు:
▪️ఎస్సీ - 989 పోస్టులు
▪️ఎస్టీ - 514 పోస్టులు
▪️ఓబీసీ - 1389 పోస్టులు
▪️ఈడబ్ల్యూఎస్ - 603 పోస్టులు
▪️యూఆర్ - 2665 పోస్టులు
👉 రాష్ట్రాల వారిగా ఖాళీల వివరాలు:
▪️ఆంధ్రప్రదేశ్ లో - 390 అప్రెంటీస్ పోస్టులు
▪️ తెలంగాణలో - 125 పోస్టులు భర్తీ చేయనున్నారు.
👉అర్హతలు : అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ▪️అయితే ఆయా కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాలి.
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉 శిక్షణ వ్యవధి : ఎస్బీఐ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
👉స్టైపెండ్: అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.15,000/- ఉంటుంది.
👉 ఎంపిక విధానం: అభ్యర్థులకు ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు.
▪️ అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల.. ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు.
▪️తరువాత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
👉 పరీక్ష విధానం: పరీక్ష పత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి.
▪️ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ చొప్పున ఉంటుంది. ఈ పరీక్ష వ్యవధి కేవలం 60 నిమిషాలు మాత్రమే.
▪️పరీక్ష పత్రం ఇంగ్లీష్, హిందీ భాషలతో సహా 13 భాషలలో ఉంటుంది.
▪️ముఖ్యంగా తెలుగు భాషలోనూ పరీక్ష పత్రం అందుబాటులో ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేదీ : సెప్టెంబర్ 1,2023
👉దరఖాస్తులకు చివరితేదీ : సెప్టెంబర్ 21,2023
👉అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ : అక్టోబర్ 06,2023
👉ఆన్లైన్ పరీక్షలు జరిగే తేదీలు : 2023 అక్టోబర్/ నవంబర్ లో జరిగే అవకాశం ఉంది.
👉Website : https://sbi.co.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRln