Type Here to Get Search Results !

GNM Admissions: మిడ్ వైఫరీ (GNM) ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం...


👉రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ లో(Nursing Schools 2023 - 2024 విద్యా సంవత్సరానికి గానూ జనరల్ నర్సింగ్ మరియు మిడ్వైఫరీ (GNM) ట్రైనింగ్ మూడేళ్ల కోర్సులో ప్రవేశానికి తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్( Online) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉ఆన్లైన్ రిజిస్ట్రేషన్ (Registration) సెప్టెంబర్ 02వ తేదీ నుంచి ప్రారంభం అయింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 16వ తేదీన ముగియనుంది. అర్హులైన అభ్యర్ధులు చివరి గడువు ముగిసే లోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో సెప్టెంబర్ 19, 2023లోగా సమర్పించాల్సి ఉంటుంది.

👉ప్రభుత్వ స్కూల్ లలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 04 వ తేదీ.. ప్రైవేట్ స్కూల్ లలో అక్టోబర్ 10, 2023 తేదీనాటికి పూర్తవుతుందని ప్రకటనలో తెలిపారు. 2023 - 2024 విద్యా సంవత్సరానికి తరగతులు 15.10.2023 నుండి ప్రారంభమవుతాయని తెలిపింది.

👉 మరిన్ని వివరాల కోసం మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారిక వెబ్సైట్ http://dme.telangana.gov.in ని సంప్రదించాలని తెలిపారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments