Type Here to Get Search Results !

ESIC ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు...


👉ESIC Recruitment Notification 2023:

👉న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెడ్ క్వార్టర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ రీజినల్ కార్యాలయాలు / ఆసుపత్రుల్లో కింది పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా తెలంగాణ రీజియన్ లో 70 ఖాళీలు భర్తీ కానున్నాయి.

👉పోస్టు / కేటగిరీ: ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, సోషల్ గైడ్ / సోషల్ వర్కర్ తదితరాలు

👉మొత్తం పోస్టుల సంఖ్య: 1,038.

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్ / డేటా ఎంట్రీ టెస్ట్ (పోస్టుకు అవసరమైతే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉రాత పరీక్ష విధానం:
▪️ టెక్నికల్ / ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50ప్రశ్నలు- 100 మార్కులు
▪️జనరల్ అవేర్నెస్ (10 ప్రశ్నలు 20 మార్కులు
▪️జనరల్ ఇంటెలిజెన్స్ (20 ప్రశ్నలు 20 మార్కులు)
▪️అరిథ్మెటిక్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు)అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి.

👉మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

👉దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ రూ.500. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / ఈఎస్ఎం / మహిళలకు రూ.250.

👉దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 01, 2023

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2023

👉Websitewww.esic.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments