👉ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
👉పార్ట్ టైమ్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
👉 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించింది ఉస్మానియా యూనివర్సిటీ. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
👉ఖాళీల వివరాలు:
ఎంఏ-ఎకనామిక్స్, ఎంఎస్సీ-మాథ్స్, కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
👉అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దీంతో పాటు నెట్/స్లెట్ లేదా PhD ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉 వయస్సు: 65 ఏళ్లకు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ దరఖాస్తులను డైరెక్టర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ పీజీ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ చిరునామాలో ఈ నెల 15వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: