Type Here to Get Search Results !

10, ఇంటర్ అర్హతతో భారీగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...


👉Indian Coast Guard Navik Recruitment Notification 2023:

👉ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వివిధ విభాగాల్లో నావిక్, యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది.

👉 పోస్టులు - అర్హతలు:
1.నావిక్(జనరల్ డ్యూటీ) పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.

2.నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

3.ఇక యాంత్రిక్ పోస్ట్ల కోసం ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యునికేషన్(రేడియో-పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ఖాళీల వివరాలు:
1. కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ) - 260 పోస్టులు
2. నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)-30 పోస్టులు భర్తీ కానున్నాయి.
3. యాంత్రిక్ (మెకానికల్)-25, 4.యాంత్రిక్(ఎలక్ట్రికల్)-20, 5.యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)-15 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉మొత్తం ఖాళీలు : 350

👉వయస్సు : ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️అంటే 2002 మే 1 నుంచి 2006 ఏప్రిల్ 30 మధ్య జన్మించిన వారు అప్లై చేసుకోవడానికి అర్హులు.

👉శాలరీ :
▪️ నావిక్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం -  రూ.21,700 కాగా,
▪️ యాంత్రిక్ పోస్టులకు - రూ.29,200 లభిస్తుంది.

👉 దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి.
▪️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో ఉంటుంది.
▪️మొదటి దశలో ఆన్లైన్ రాత పరీక్ష.
▪️రెండో దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.
▪️మూడో దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా..
▪️ నాలుగో దశలో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

👉Website : www.joinindiancoastguard.cdac.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments