👉SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ 2023 - ప్రకటనను ఆగస్టు 2న విడుదల చేసింది.
👉 ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1207 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉అర్హత: 23.08.2023 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు: 1207 పోస్టులు
👉పోస్టుల వివరాలు:
1) గేడ్-సి పోస్టులు: 93
2) గ్రేడ్-డి పోస్టులు: 1114
👉వయస్సు :
▪️ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి) పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ ఇక స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్- సర్వీస్మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 8 సంత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
▪️ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
👉వితంతు విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తిస్తుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.100.
▪️మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:ఆన్లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
👉పరీక్ష విధానం:
▪️ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.
▪️ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు,
▪️జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు
▪️ ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు- 100 మార్కులు ఉంటాయి.
▪️ పరీక్ష సమయం 2 గంటలు. ప్రత్యేక అవసరాలుగల అభ్యర్థులకు 40 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు.
👉పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.
👉సదరన్ రీజియన్ లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్.
👉దరఖాస్తుల ప్రారంభం: 02.08.2023
👉 దరఖాస్తుకు చివరితేదీ: 23.08.2023
👉ఆన్లైన్ రాతపరీక్ష: 2023 అక్టోబరులో
👉 Website : https://ssc.nic.in/Portal/Apply
👉 Notification link : https://drive.google.com/file/d/1OWtogvL2fPwMJ2HQf-Kz3WbnX196VaWb/view?usp=drivesdk
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.