Type Here to Get Search Results !

NCC పట్టభద్రులకు ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక... ఆగష్టు 03 చివరి తేది...


👉NCC Recruitment Notification 2023:

👉గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం ఇండియన్ ఆర్మీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.

👉మహిళలు సహా అవివాహిత పట్టభద్రులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు మంచి హోదాతోపాటు ఆకర్షణీయ వేతనాలు పొందవచ్చు.

👉అర్హతలు:
▪️కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
▪️ అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు NCC సీనియర్ వింగ్లో కొనసాగి ఉండాలి.
▪️ NCC సర్టిఫికెట్లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి.
NOTE: యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు NCC సర్టిఫికెట్ అవసరం లేదు.

👉వయస్సు : 01.01.2024 నాటికి 19-25 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 02,1999-జనవరి 1 2005 మ«ధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.

👉మొత్తం ఖాళీలు :55
▪️(వీటిలో 50 పురుషులకు, 5 మహిళలకు).
▪️ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు(పురుషులకు 5, మహిళలకు 1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించారు.

👉NCC ఎంట్రీ స్కీమ్ఇండియన్ ఆర్మీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఏడాదికి రెండుసార్లు NCC స్పెషల్ ఎంట్రీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
▪️ అకడమిక్ మార్కుల ఆధారంగా షార్టిస్ట్ చేస్తారు.
▪️షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
▪️దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూలు ఉంటాయి.
▪️ సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. ▪️రెండు దశల్లో అయిదు రోజులపాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి.
▪️మొదటి రోజు స్టేజ్-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఆ తర్వాత 4 రోజులపాటు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూకు అనుమతిస్తారు.
▪️ స్టేజ్-2 లో విజయం సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.

👉శిక్షణ-వేతనాలు:
▪️ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఆఫీసర్ ట్రైయినింగ్ అకాడెమీ, చెన్నైలో 49 వారాల «శిక్షణ ఉంటుంది.
▪️ ట్రైనింగ్ సమయంలో ప్రతి నెల రూ.56,100 స్టైపెండ్ అందిస్తారు. ▪️విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మాద్రాస్ యూనివర్సిటీ ప్రధానం చేస్తుంది.
▪️వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు.
▪️అనంతరం ఆర్మీ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల మేఁరకు కొందరిని పర్మనెంట్ కమిషన్లోకి తీసుకుంటారు.
▪️మిగిలిన వారికి మరో నాలుగేళ్ల పాటు సర్వీస్ పొడిగిస్తారు. వైదొలగాల్సి ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 03.08.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments