Type Here to Get Search Results !

APFPS: ఏపీఎఫ్పీఎస్ డీఆర్సీ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు...


👉APFPS Recruitment Notification 2023:

👉రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ(ఏపీఎఫ్పీఎస్)లో జిల్లా రిసోర్స్ పర్సన్(డీఆర్సీ)గా పనిచేసేందుకు ఆసక్తి గల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ప్రభాకరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

👉ఫుడ్ ప్రాసెసింగ్లో డిగ్రీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

👉 అర్హత: వ్యవసాయ, ఉద్యాన, డిగ్రీలతో పాటు ఇతర డిగ్రీలు పూర్తి చేసి, బ్యాంకింగ్పై అవగాహన కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

👉సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులకు అవగాహన కల్పించడం, బ్యాంకు లింకేజీ చేయించడం, ఆహార పరిశ్రమల స్థాపనకు వీరు కృషి చేయాల్సి ఉంటుందన్నారు.

👉పూర్తిగా ఇన్సెంటివ్ పద్ధతిలో మాత్రమే ప్రయోజనం ఉంటుందన్నారు.

👉ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో ఈ నెల 4న, మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యాన కార్యాలయం, గుండాల వీధి, తుమ్మపాల గ్రామం నందు స్వయంగా హాజరుకావాల్సిందిగా కోరారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.



Tags

Post a Comment

0 Comments