Type Here to Get Search Results !

AP Govt: 9 గంటల్లోపు హాజరు వేయకపోతే సెలవు పెట్టాల్సిందే... AP Teachers కి Big Update...


👉 AP ఉపాధ్యాయులపై ప్రభుత్వం ఒత్తిడిసిగ్నల్స్ ఉన్నా.. లేకున్నా వేయాల్సిందేనంటూ హెచ్చరిక..

👉 AP రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకు ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తోంది.

👉 గతంలో జీతాలివ్వడంలో ఆలస్యం చేయడం.. ఆందోళనలకు పిలుపునిస్తే ముందుస్తు అరెస్టులు, బైండోవర్ కేసులు పెట్టడం చేసింది.

👉 కొంతకాలంగా తనిఖీలు, షోకాజ్ నోటీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ముఖఆధారిత హాజరు నమోదుపై దృష్టి పెట్టింది. సిగ్నల్స్తో సంబంధం లేకుండా అందరూ నిర్ణీత సమయంలోపు ఆన్లైన్ హాజరు వేయాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది.

👉 ఎక్కడైనా కొంత ఆలస్యంగా హాజరు వేస్తే సెలవు పెట్టుకోవాల్సిందేనంటూ వాట్సప్ సమాచారం పంపింది. జిల్లా స్థాయి అధికారులు ప్రధానోపాధ్యాయులకు సమాచారం పంపారు.

👉 సోమవారం నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఉదయం 9గంటలలోపు హాజరైన వారికి మాత్రమే హాజరు లెక్కలోకి తీసుకుంటారు.

👉 ఆ తర్వాత హాజరు వేస్తే సీఎల్ పెట్టుకోవాల్సిందే. సీఎల్ పెట్టకపోతే షోకాజ్ నోటీసిచ్చి, వివరణ కోరనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

👉 వీరిలో కొంతమంది ఉదయం 9 గంటల తర్వాతే హాజరు వేస్తున్నారంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి క్షేత్రస్థాయి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సెలవుల నిబంధనల ప్రకారం నెలలో మూడు పర్యాయాలు ఆలస్యంగా వస్తే సగం రోజు సీఎల్ పెట్టాల్సి ఉంటుంది.

👉 కానీ, ఇప్పుడు దీన్ని ప్రస్తావించకుండా ఆలస్యంగా వస్తే సెలవు పెట్టాల్సిందేనని హెచ్చరికలు ఇస్తున్నారు.

👉 సిగ్నల్స్ లేకపోతే..

👉 రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉండవు. గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

👉 ఇలాంటిచోట ఆలస్యంగా హాజరు నమోదైతే ఉపాధ్యాయుడి పరిస్థితి ఏంటనే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు.

👉 ఉపాధ్యాయులను స్థానిక అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేశారు. కేడర్ స్ట్రెంత్ పూర్తి కానందున వీరి హాజరు నమోదుపై స్పష్టత లేదు. ఇలాంటివారిలో కొందరు హాజరు వేయనట్లు డ్యాష్ బోర్డులో చూపిస్తోంది. డీడీఓలు దీన్ని సరిచేయాల్సి ఉంది.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments