Type Here to Get Search Results !

TS PGECET : పిజిఇసెట్ కౌన్సెలింగ్ వాటి వివరాలు...


👉హైదరాబాద్ : రాష్ట్రంలో ఎం.టెక్, ఎం. ఫార్మసీ, ఎం. ఆర్క్ ప్రవేశాలకు నిర్వహించే పిజిఇసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

👉ఈ నెల 28వ తేదీన పిజిఇసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం ఈ నెల 31 నుంచి ఆగస్టు 18 వరకు వెబ్సైట్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని ప్రవేశాల కన్వీనర్ పి.రమేశ్బాబు తెలిపారు.

👉 అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో పిజిఇసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఖరారు చేశారు.

👉అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 18 వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

👉ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.

👉 ఆగస్టు 26వ తేదీన మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సెప్టెంబర్ 4 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుండగా, అదే నెల 19 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

👉 ఇటువంటి విద్య, ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments