👉NCC Special Entry Jobs 2023 :
👉 డిగ్రీ పూర్తి చేసి NCC 'సీ' గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థుల కోసం స్పెషల్ ఎంట్రీ స్కీం కింద ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.
👉అర్హత : పెళ్లి కాని గ్రాడ్యూయేట్ లు NCC అర్హత సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
▪️అలాగే వీరు ఏదైనా స్ట్రీమ్ లో కనీసం 50 శాతం మార్కులు ఉత్తీర్ణతతో డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
▪️అలాగే మూడు అకాడమిక్ సంవత్సరాలు NCC సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి.
▪️ అలాగే NCC 'సీ' సర్టిఫికెట్ లో కనీసం 'బీ' గ్రేడ్ పొందాలి.
▪️యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు NCC 'సీ' సర్టిఫికెట్ తప్పనిసరి కాదు.
👉NCC Special Entry Details : ఈ స్కీం కింద దరఖాస్తు చేసుకోవాలంటే పురుషులు సహా మహిళలు అవివాహితులు అయి ఉండాలి.
▪️ ఇంటర్వ్యూ ద్వారా వీరిని ఎంపిక చేసి శిక్షణను ఇస్తారు.
▪️ ఇందులో విజయవంతమైతే లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేరిపోవచ్చు.
▪️ అంతేకాకుండా వీరికి ఆకర్షణీయ జీతంతో పాటు ప్రోత్సాహకాలూ ఉంటాయి.
👉 ఎంపిక విధానం: NCC స్పెషల్ ఎంట్రీ స్కీం కింద వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకాడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
▪️ఇలా వడపోతలో నిలిచినవారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
▪️ ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది.
▪️సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో రెండు దశల్లో ఐదు రోజులపాటు ముఖాముఖి జరుగుతుంది.
▪️ తొలిరోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులుగా నిలిచిన వారికే తర్వాతి 4 రోజుల స్టేజ్-2లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.
▪️ ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు ఎంపిక చేస్తారు.
👉 శిక్షణ - స్టైపెండు:
ఎంపికైన అభ్యర్థులకు 2024 ఏప్రిల్ నుంచి చెన్నై-ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాలు శిక్షణ ఉంటుంది.
▪️ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండు చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది.
▪️అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు.
▪️ఆ తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్ కమిషన్)లోకి తీసుకుంటారు.
▪️మిగిలినవారికి మరో నాలుగేళ్లు సర్వీస్ ను పొడిగిస్తారు. అనంతరం వీరు రిటైరవుతారు. లెఫ్టినెంట్ గా విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్లకు మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు చేరుకోవచ్చు.
▪️వీరికి రూ. 56,100 మూలవేతనంతోపాటు మిలిటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఎస్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం పొందవచ్చు. దీంతో పాటు పలు ప్రోత్సాహకాలూ ఉంటాయి.
👉 మొత్తం ఖాళీలు: 55
▪️ఇందులో 50 పురుషులకు, 5 మహిళలకు కేటాయించారు.
▪️ అలాగై ఈ రెండు విభాగాల్లోనూ 6 (పురుషులు 5, మహిళలు 1) పోస్టులు యుద్ధంలో అమరులైన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.
👉 వయస్సు: 2024, జనవరి 1 నాటికి 19 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
▪️ 1999, జనవరి 2 - 2005, జనవరి 1 మధ్య జన్మించినవారు మాత్రమే అర్హులు.
👉 దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 3, 2023
👉శిక్షణ ప్రారంభం: ఎంపికైన అభ్యర్థులకు 2024, ఏప్రిల్ నుంచి శిక్షణను ప్రారంభిస్తారు.
👉Website : www.joinindianarmy.nic.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: