Type Here to Get Search Results !

AP: అంగన్వాడీ ఉద్యోగాలు...జులై 25 దరఖాస్తులకు చివరి తేదీ...

👉Anganwadi Jobs 2023:

👉నంద్యాల(అర్బన్): జిల్లాలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్, మినీ అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ, శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి నిర్మల తెలిపారు.

👉అర్హత : పదవ తరగతి పాసై, ఈ నెల 1వ తేదీకి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

👉పెళ్లి అయి అదే గ్రామంలో నివాసం ఉన్న వారు అర్హులని, నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుందన్నారు.

👉పోస్టులు :
▪️ మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు - 7
▪️మినీ అంగన్వాడీ కార్యకర్తలు - 2
▪️ ఆయా పోస్టులు - 34
నియామకానికి దరఖాస్తులు కోరుతున్నామన్నారు.
▪️స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు పదవ తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

👉వయస్సు : ఈ నెల 1వ తేదీకి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

👉దరఖాస్తు వెంట ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అటెన్షన్ చేయవలెను) జత పరిచి సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో ఈనెల 18 నుంచి 22వ సాయంత్రంలోగా అందజేయాలన్నారు.

👉 సంబంధిత పూర్తి వివరాలకు సీపీడీఓ కార్యాలయాల్లో సంప్రదించాగలరు.


👉ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుకు: 
ఐసీడీఎస్ బలోపేతం చేసి పోషణ స్థాయిని మెరుగు పరిచే ప్రాజెక్టు ఎస్ఎస్ఎం/పోషణ్ అభియాన్ జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ నిర్మల తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 నుంచి 25వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో అందించాలన్నారు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments