👉Cluster Reserve Mobile Teacher in AP: ఏపీలో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్...
👉పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా సెలువులో ఉంటే వారి స్థానంలో రిసోర్స్ పూల్లో ఉన్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ బోధన చేస్తారు.
👉 ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
👉ఇప్పటివరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్నచోట సెలవు పెట్టినా, డెప్యుటేషన్లపై మరో చోటకు వెళ్లినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకు ఇబ్బంది ఏర్పడుతోంది.
👉 ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఆర్ఎంటీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.
👉 హైస్కూల్ కాంప్లెక్స్ లో బడి బయట పిల్లల డేటాను సేకరించి వారిని బడిలో చేర్పించేందుకు, ఇతర విధులకు 2001-09 మధ్య రెండు మూడు ఉన్నత పాఠశాలలకు ఒక్కరు చొప్పున క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను (సీఆర్పి) నియమించింది.
👉ప్రస్తుతం ఆయా విధుల్లో చాలా వరకు ఎంఈవోలు, ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లు చేస్తున్నారు.
👉దీంతో పాఠశాలల్లో బోధనకు అన్ని అర్హతలు ఉన్న సీఆర్పీలను బోధన ప్రయోజనాల కోసం ఉపయోగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించి మండలాన్ని ఒక క్లస్టర్గా రిజర్వ్ మొబైల్ టీచర్లుగా వారిని నియమించింది.
👉ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,489 మంది క్లస్టర్ రిసోర్స్పర్సన్లు ఇకపై క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లుగా మారనున్నారు.
👉ఎంఈవో పర్యవేక్షణలో ఒక్కో సీఆర్ఎంటీ మూడు లేదా నాలుగు పాఠశాలలకు సేవలు అందించేలా విధులను నిర్ణయించారు.
👉 రాష్ట్రంలోని 9,602 ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిద్వారా నిరాటంకంగా బోధన అందించవచ్చు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉 Telegram Link: