Type Here to Get Search Results !

Big Update: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ను త్వరలో నిర్వహించనున్నారు...


👉TET: Teacher Eligibility Test 2023:

👉 ఇటీవల జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు తెలంగాణ ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు అందజేశారు.

👉ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్ 15 ముందు లేదా తర్వాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు.

👉టెట్ వ్యవధి జీవితకాలం.. కానీ..తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో 1.5 లక్షల డీఎడ్, 4.5 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులున్నారు. 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 టీచర్ పోస్టులను భర్తీచేశారు. గతంలో టెట్కు 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా, రెండేండ్ల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పోటీపడే అవకాశం డీఎడ్ వారికే ఇవ్వగా, ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు.

👉దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 లక్షల మంది టెట్ క్వాలిఫై కానివారున్నారు. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఎడ్ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకుంటారు. తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కుతుంది. అలాగే ఈ టెట్ పరీక్ష ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్ అయ్యే అవకాశం వస్తుందని లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూశారు.

👉12 వేల టీచర్ పోస్టుల ఖాళీలు :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్ఓటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.

👉టెట్-పేపర్-1వివరాలు...
రెండున్నర గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో అయిదు విభాగాలుగా ఉంటుంది.


👉టెట్ పేపర్-2 వివరాలు...
ఆయా సబ్జెక్ట్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్ పేపర్-2ను కూడా నాలుగు

👉విభాగాలుగా, 150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వివరాలు..

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:





Tags

Post a Comment

0 Comments