Type Here to Get Search Results !

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (01/ 2024) ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ - అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (01/ 2024) బ్యాచ్ నియామకం.

👉అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) / ఇంటర్మీడియట్ (సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) / ఇంటర్ ఒకేషనల్. (లేదా) మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) / తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య / వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉వయస్సు : 27-07-2003 నుంచి 27-12-2006 మధ్య జన్మించి ఉండాలి.
▪️sc st కి 5 ఏళ్ళు
▪️ OBC కి 3 ఏళ్ళు
▪️PWD కి 10 ఏళ్ళు వయసు సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1 (ఆన్లైన్ రాత పరీక్ష), ఫేజ్-2 (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3 (మెడికల్ ఫిట్నెస్ టెస్ట్), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

👉ఎత్తు:
▪️ పురుషులు 152.5 సెం.మీ.
▪️మహిళలు 152 సెం.మీ. ఉండాలి.

👉పరీక్ష ఫీజు: రూ.250/-

👉ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూలై 27, 2023

👉 దరఖాస్తులు చివరి తేదీ: ఆగస్ట్ 17, 2023

👉 ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం: 13-10-2023.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

Tags

Post a Comment

0 Comments