👉 రెండో దశ పనులు జరుగుతున్న స్కూళ్లలో ప్రత్యేక భద్రత చర్యలపై పలు సూచనలు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు.
👉 ఈ క్రింది జాగ్రత్తలన్నీ తీసుకుని ఫొటోలతో సహా విద్యా శాఖకు నివేదికలు పంపించాలి.
👉 పని ప్రదేశంలో ప్రథమ చికిత్స కిట్ ఉంచాలి
👉 విద్యుత్ లైన్లు ఎక్కడ పడితే అక్కడ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
👉 అగ్నిప్రమాదాలు, ఇతర సందర్భాల్లో అత్యవసర నిష్క్రమణ ప్రణాళికలు రూపొందించాలి
👉 పాఠశాల ఆవరణలో గుంతలన్నీ పూర్తిగా పూడ్చివేయాలి. ఎక్కడా నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి
👉 పాఠశాలల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జిల్లా, మండల అధికారులు స్వయంగా స్కూళ్లకు వెళ్లి పరిశీలించాలి
👉 తల్లిదండ్రుల కమిటీ, ఇంజనీర్తో కలిసి హెడ్ మాస్టర్ పాఠశాల ఆవరణ మొత్తం తిరిగి ప్రమాదాలు జరిగే ప్రదేశాలను, పరికరాలను గుర్తించాలి
ఆ ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలి.
👉 హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పిల్లలు, సిబ్బంది వెళ్లకుండా సేఫ్టీ టేపులతో కంచెలు వేయాలి
👉 పిల్లలు, సిబ్బంది రాకపోకలకు సురక్షిత మార్గాలు ఏర్పాటు చేయాలి
👉 స్కూలు తెరవడానికి ముందు లేదా స్కూలు సమయం ముగిసిన తరువాతే యంత్రాలు, పరికరాలు, మెటీరియల్ తొలగించాలి
👉 కూల్చివేతలు చేపట్టినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఆస్తులకు నష్టం కలగకుండా చూడాలి
👉 వ్యర్థాలను పాఠశాలలకు దూరంగా వేయాలి
👉 పనులు చేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు జాగ్రత్తలు పాటించాలి. హెల్మెట్, స్టీల్ టోడ్ బూట్లు, ఫేస్ స్క్లు వంటివి ధరించాలి.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉 Telegram Link: https://t.me/+WOlyYT7KikdlOGRl