👉లక్షలు లేనిది ఉన్నతవిద్య అందడం లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు అయ్యే ఖర్చుకు భయపడి మధ్యలోనే మానేస్తుంటారు.
👉 ఈ కాలంలో చదువు అంటే ఆర్థిక భారం మోయాల్సిందే. చిన్న పాటి ప్రైవేటు స్కూలులో, కాలేజీలు చేర్పించినా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే.
👉 కొంత మంది చదువులో బాగా రాణించినా తదుపరి విద్య కోసం డబ్బు పెట్టే స్తోమత లేక డ్రాపవుట్స్ గా మిగిలిపోతుంటారు.
👉 అలాంటి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చినవే స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు. అర్హత, ప్రాంతం, అవసరానికి అనుగుణంగా దరఖాస్తు చేయడం ద్వారా స్కాలర్షిప్ లు పొందవచ్చు.
👉 చాలా స్కాలర్ షిప్లకు విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచడమే అర్హత. మరికొన్ని స్కాలర్షిప్లకు చదువుతో పాటు వెనకబడిన కులాలకు చెందిన వారు అయి ఉండాలి.
👉 9వ తరగతి నుంచి పీజీ లాంటి ఉన్నత విద్య అభ్యసించేంత వరకు రకరకాల స్కాలర్ షిప్ లు అందుబాటులో ఉన్నాయి.
👉 JM సేథియా మెరిట్ స్కాలర్షిప్ పథకం 2023
◾️ ఈ స్కాలర్ షిప్ను JM సేథియా ఛారిటబుల్ ట్రస్ట్ అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే 9వ తరగతి నుంచి పీజీ వరకు అంటే ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెనల్ కోర్సుల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తుంది.
◾️వారిని మొదట కేటగిరీలుగా విభజిస్తారు. స్కాలర్ షిప్ లకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారికి ప్రతి నెలా కెటగిరీ వారీగా డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు.
◾️ఈ JM సేథియా మెరిట్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31, 2023 చివరి తేది. ఈ స్కాలర్ షిప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి jmitrust.com ని సందర్శించవచ్చు.
◾️ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన తర్వాత, కోర్సు ప్రకారం నెలకు రూ. 10 వేల రూపాయల వరకు పొందవచ్చు. సేథియా ఛారిటబుల్ చిరునామా - జేఎం సేథియా ఛారిటబుల్ ట్రస్ట్, 133, బిప్లబీ రాష్ బెహరీ బసు రోడ్డు, 3వ అంతస్తు, రూమ్ నెం. 15, కోల్ కతా- 700001
▪️ఇమెయిల్ ఐడి - jms_trust@yahoo.in
▪️ఫోన్ నంబర్ - (91)-33-2236-0368/67 ▪️మొబైల్ నంబర్ - (91)-93397 93153.
👉 రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్షిప్ 2023
◾️ ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్ ను రామన్ కాంత్ ముంజాల్ ఫౌండేషన్ అందజేస్తోంది. ఇది ప్రధానంగా ఫైనాన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.
◾️బీబీఏ, బీఎఫ్ఎస్ఐఏ, బీకామ్ (హెచ్ఐ), మేనేజ్మెంట్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్(IPM), BA(ఎకనామిక్స్), బ్యాచిలర్ ఇన్ బిజినెస్ స్టడీస్ అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
◾️హీరో గ్రూప్ ఇనిషియేటివే ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్.
◾️విద్యార్థులకు తప్పనిసరిగా 10వ, 12వ తరగతుల్లో కనీసం 80 శాతం మార్కులు రావాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4 లక్షల లోపు మాత్రమే ఉండాలి.
◾️ఈ స్కాలర్ షిప్ కింద విద్యార్థులకు రూ. 40 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఏడాదికి ఇస్తారు. విద్యార్థి ఏ విద్యా సంస్థలో, ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు అనే దానిపై స్కాలర్ షిప్ మొత్తం ఆధారపడి ఉంటుంది.
◾️ఈ స్కాలర్ షిప్ ను మూడేళ్ల పాటు అందిస్తారు. మరిన్ని వివరాల కోసం scholarships@rkmfoundation.org కు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం ఈ కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: