👉లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
👉 ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ కోసం ఢిల్లీ హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపడుతోంది.
👉అర్హత: ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 2023 జనవరి 1 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
▪️జులై 29 నాటికి అడ్వకేట్ గా కనీసం ఏడేళ్లుగా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తుండాలి.
👉ఖాళీల వివరాలు:
▪️ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 16 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
▪️జనరల్ కేటగిరీ నుంచి 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ నుంచి 7, ఎస్టీ కేటగిరీ నుంచి 6 పోస్టులను భర్తీ చేయనున్నారు.
▪️ లీగల్ సర్వీస్, న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
👉శాలరీ : ఎంపికయ్యే అభ్యర్థులకు జీతాలు భారీ స్థాయిలో ఉంటాయి. నెలకు జీతం రూ. 1,31,100 నుంచి 2,16,600 మధ్య ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు:
▪️జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.2,000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
▪️ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి.
👉 ఎంపిక విధానం:
▪️అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఢిల్లీ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
▪️ఇది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామ్, రెండో దశలో మెయిన్స్, వైవా ఉంటుంది. మూడో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టు 20న జరగనుంది.
▪️ పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
▪️ ఇందులో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ రౌండ్కు పిలుస్తారు.
▪️ఎంపిక ప్రక్రియలో పరీక్షల ద్వారా అభ్యర్థుల నాలెడ్జ్, నైపుణ్యాలు, ప్రవర్తనను అంచనా వేస్తారు.
▪️జిల్లా న్యాయమూర్తులుగా పనిచేయడానికి అభ్యర్థుల సంసిద్ధతపై ఓ అంచనాకు వస్తారు.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : జులై 29,2023
👉Website : delhihighcourt.nic.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: