Type Here to Get Search Results !

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు ధ్రువపత్రాల పరిశీలన.. జులై 18 నుంచి...


👉AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి.

👉ఆయా ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

👉 దాదాపు 3,546 ఉద్యోగాల భర్తీకి గతేడాది హైకోర్టు నోటిపికేషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

👉గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి జాబితాలో ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లు రెండో జాబితాలోనూ ఉండటంతో వాటిని సరిచేస్తూ తాజాగా మరో జాబితా విడదల చేసింది.

👉వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థులకు జులై 18 నుంచి 31 ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నట్లు తెలియజేస్తూ ఏపీ హైకోర్టు అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

👉ఆయా తేదీల్లో సంబంధిత జిల్లాల్లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ కోర్ట్స్ పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన చేపడుతారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.

👉ఏయే తేదీల్లో ఏయే పోస్టులకు ధ్రువపత్రాల పరిశీల ఉంటుంది.

▪️స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, డ్రైవర్ ఉద్యోగాలకు జులై 18వ తేదీన

▪️జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జులై 19వ తేదీన

▪️ ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఉద్యోగాలకు జులై 20వ తేదీన

▪️రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జులై 21వ తేదీన

▪️ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకు జులై 22, 24 తేదీల్లో

▪️ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు జులై 26, 31 తేదీల్లో

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం క్రింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments