Type Here to Get Search Results !

SSB లో సబ్ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ...


👉న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
▪️ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్ఎస్బీ(SSB) పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

👉ఖాళీలు : సబ్ ఇన్స్పెక్టర్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్): 111 పోస్టులు

👉కేటగిరీ వారీగా ఖాళీలు:

1. ఎస్సై (పయనీర్): 20 పోస్టులు
2. ఎస్సై (డ్రాఫ్ట్స్ మ్యాన్: 03 పోస్టులు
3. ఎస్సై (కమ్యూనికేషన్): 59 పోస్టులు
4. ఎస్సై (స్టాఫ్ నర్సు- ఫిమేల్): 29 పోస్టులు

👉అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : ఎస్సై (పయనీర్, డ్రాఫ్ట్స్మ్యేన్, కమ్యూనికేషన్) పోస్టులకు 18-30 ఏళ్లు.
▪️ఎస్సై (స్టాఫ్ నర్సు) పోస్టులకు 21-30 ఏళ్లు మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.35,400 - 1,12,400/-

👉 దరఖాస్తు ఫీజు : రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 18, 2023

👉వెబ్సైట్ : www.ssbrectt.gov.in
Tags

Post a Comment

0 Comments