Type Here to Get Search Results !

ఏకలవ్య పాఠశాలల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉హైదరాబాద్ - తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 239 గెస్ట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

👉ఈమేరకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

👉ఎంపికైన అభ్యర్థులకు స్కూల్ క్యాంపస్ లోనే వసతి సదుపాయం కల్పిస్తారు.

👉 సీబీఎస్ఈ సిలబస్ ను ఇంగ్లిష్ లో బోధించాల్సి ఉంటుంది.

👉అర్హత కల అభ్యర్థులు జులై 2 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ (టీఎస్ఈఎస్) ప్రకటన వెలువరించింది.

👉అర్హతలు : ఆయా సబ్జెక్టు స్పెషలైజేషన్ తో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్ డీ, ఎంఫిల్, ఎంఈడీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

▪️ టెట్ లో అర్హత సాధించడంతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరి.

👉 వయస్సు : జులై 1, 2023 నాటికి 60 ఏళ్లకు మించకూడదు.

👉 ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, టీచింగ్ అనుభవం, నైపుణ్యాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 👉శాలరీ : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) కు నెలకు రూ.35,750/- చెల్లిస్తారు.

 👉 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) కు రూ.34,125/-ల వరకు జీతంగా చెల్లిస్తారు.

👉 దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మినహా మిగతా అభ్యర్థులు రూ. 100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.

👉సబ్జెక్ట్ వారీగా ఖాళీల వివరాలు.. ▪️పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (పీజీటీ)
▪️ఇంగ్లిష్ - 15
▪️హిందీ- 9
▪️గణితం- 11
▪️ భౌతికశాస్త్రం- 18
▪️కెమిస్ట్రీ- 5
▪️ జీవశాస్త్రం- 13
▪️ చరిత్ర- 16
▪️భూగోళశాస్త్రం- 17
▪️కామర్స్- 5
▪️ఎకనామిక్స్- 10
▪️ తెలుగు - 07
▪️ఐటీ- 13

👉ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
▪️ఇంగ్లిష్- 27
▪️హిందీ- 12
▪️తెలుగు- 17
▪️గణితం- 14
▪️సైన్స్- 19
▪️సోషల్ సైన్సెస్- 11

👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl




Tags

Post a Comment

0 Comments