Type Here to Get Search Results !

రేపటి నుంచి దరఖాస్తుల ప్రారంభం...ఐటీబీపీలో(ITBP)లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...


👉ITPB Recruitment Notification 2023:

👉ఐటీబీపీ 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతున్నారు.

👉ITBP Jobs 2023 : ఇండో - టిబెటన్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉వీరు ఒప్పంద ప్రాతిపదికపై డ్రైవర్స్ పనిచేయాల్సి ఉంటుంది.

👉 అయితే పనితీరు ఆధారంగా వీరిని శాశ్వత ఉద్యోగులుగా కూడా తీసుకునే అవకాశం ఉంది.

👉అర్హతలు : ఐటీబీపీ కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొంది బోర్డ్ నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
▪️ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

👉కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు:
▪️యూఆర్ - 195
▪️ఈడబ్ల్యూఎస్ - 45
▪️ఓబీసీ - 110
▪️ఎస్సీ - 74
▪️ఎస్టీ - 37

👉వయస్సు :2023 జులై 26నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
▪️ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది.

👉 దరఖాస్తు ఫీజు:
▪️ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100/- చెల్లించాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: ఐటీబీపీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఎంపిక విధానం 5 స్టేజ్ లుగా ఉంటుంది.

1. శరీర దారుఢ్య పరీక్ష (పీఈటీ/పీఎస్) : అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్ఓ) నిర్వహిస్తారు.

2. రాత పరీక్ష : శరీర దారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ : రాతపరీక్షలో నెగ్గిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

4. డ్రైవింగ్ టెస్ట్ : ఈ దశలో అభ్యర్థుల డ్రైవింగ్ సామర్థ్యాలను, నిపుణతను పరీక్షిస్తారు.

5. మెడికల్ టెస్ట్ : డ్రైవింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకు చివరిగా మెడికల్ టెస్ట్లు చేస్తారు.

👉శాలరీ: నెలకు రూ.21,700/- నుంచి రూ .69,100/- (లెవెల్-3) వరకు ఉంటుంది.

 👉దరఖాస్తుల ప్రారంభ తేదీ:
 జూన్ 27, 2023

 👉 దరఖాస్తులకు చివరి తేదీ :
జులై 26,2023

👉వెబ్సైట్https://www.itbpolice.nic.in/




Tags

Post a Comment

0 Comments