Type Here to Get Search Results !

సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...



👉సింగరేణి బొగ్గు గనుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉తెలంగాణ, కొత్తగూడెలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2023-24 సంవత్సరానికిగానూ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉అర్హత : పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు.

👉వయస్సు : 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

👉ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్లు, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్ తదితర ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ ఇవ్వనున్నట్లు తన ప్రకటనలో తెల్పింది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ :
▪️ జూన్ 30వ తేదీలోపు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా కూడా అందించవచ్చు.
▪️అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని సంబంధిత ఎంవీటీసీ కేంద్రాల అడ్రస్లలో దరఖాస్తులను పంపించాలి.
▪️ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
▪️సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుని తుది ఎంపిక చేస్తారు.

👉 అర్హత సాధించినవారు అయా ట్రేడుల్లో నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు స్టెఫెండ్ చెల్లిస్తారు.

👉 ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments