👉 చదువుతూనే ఎక్కువ మంది పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. దానికి కావాల్సిన నైపుణ్యాలు, కొంచెం తెలివితేటలు ఉంటే చాలు మీరు అనుకున్న కలలు మీ సొంతం...
👉మీరు ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు చేస్తూ ఉంటే.. మీరు ఆ విభాగంలో పార్ట్ టైమ్ జాబ్స్ ను ఎంచుకోవచ్చు.
👉విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు.
👉ఇండియాలో ఈ ట్రెండ్ తక్కువ. ఆర్థిక అవసరం ఉన్న కొంతమంది విద్యార్థులు మాత్రమే పార్టమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.
👉అయితే విద్యార్థులు చదువుతో పాటు పార్టమ్ ఉద్యోగాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న విద్యార్థులు ఈ వేసవి సెలవుల్లో పార్ట్ టైమ్ జాబ్స్ చేసి కుటుంబానికి అండగా ఉండొచ్చు .
👉 వచ్చే విద్యాసంవత్సరం ఫీజులు, పుస్తకాల ఖర్చుకు అవసరమైన మొత్తాన్ని ముందే సమకూర్చుకోవచ్చు.
👉 తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసా ఇవ్వొచ్చు.
👉ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఉత్తమమైన పార్ట్టైమ్ జాబ్ ఆప్షన్లు ఏమిటో చూద్దాం.
👉డేటా ఎంట్రీ ఉద్యోగాలు: మంచి టైపింగ్ నైపుణ్యాలు మరియు గడువులోపు పని చేసే వారికి డేటా ఎంట్రీ ఒక అద్భుతమైన పార్ట్ టైమ్ జాబ్ ఆప్షన్. ఈ ఉద్యోగాలు పూర్తి సమయం, పార్ట్ టైమ్ మరియు ఫ్రీలాన్స్ మోడ్లలో అందుబాటులో ఉంటాయి.
👉వీటిలో ఎక్కువ భాగం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలే. సాధారణంగా Microsoft Office Microsoft Excel స్ప్రెడీషీట్లతో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పనిని చేయగలరు.
👉మీకు బైక్ ఉంటే.. ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ బాయ్ లేదా ఊబర్, ఓలా బైక్ రైడర్ లగా పని చేసి డబ్బు సంపాధించవచ్చు. ఇలా చేస్తే మీకు వీలున్న సమయంలో మాత్రమే పని చేసే అవకాశం ఉంటుంది.
👉ట్యూషన్స్: మీకు పట్టు ఉన్న అంశాలపై ఆన్లైన్, ఆఫ్ లైన్ విధానంలో ట్యూషన్స్ చెప్పడం ద్వారా మీరు మంచి మొత్తాన్ని సంపాధించవచ్చు. తద్వారా మీకు ఆయా అంశాలపై పట్టు కూడా పెరుగుతుంది.
👉ఫ్రీలాన్స్ రైటింగ్:
పార్ట్ టైమ్ పని కోరుకునే విద్యార్థులకు ఫ్రీలాన్స్ రైటింగ్ ఒక అద్భుతమైన అవకాశం. ఫ్రీలాన్స్ రైటింగు ల్యాప్టాప్ మరియు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
👉ఫ్రీలాన్స్ రచయితలు అనేక రకాల అంశాలపై, విభిన్న శైలులలో రాయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ అనుభవంతో భవిష్యత్ లో పూర్తి సమయం ఉపాధిని కూడా పొందవచ్చు. ప్రస్తుతం అనేక వెబ్ సైట్లు, యాప్ లు ఫ్రీలాన్స్ రైటర్లకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
👉ఆన్లైన్ అమ్మకం: భారతదేశంలో ఈ-కామర్స్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం గతంలో కంటే ఇప్పుడు సులభం. విద్యార్థులు ఆన్లైన్లో ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు.
👉చేతితో తయారు చేసిన హస్తకళలు లేదా ఇతర ప్రత్యేకమైన వస్తువులను విక్రయించవచ్చు. ఆన్లైన్ అమ్మకం వల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం కోసం మరొకరిని నియమించాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.
👉 మీ నైపుణ్యాలు, మీ ఆసక్తిని బట్టి మీకు సరిపోయే పార్ట్ టైమ్ ఉద్యోగాలను ఎంచుకోవచ్చు.