👉అర్హత : ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత అయి ఉండాలి.
◾️సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 38
◾️అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (స్కిల్ డెవలప్మెంట్/ ప్రాసెసింగ్/ టెస్టింగ్/ డిజైన్/ టూల్రూమ్/ క్యాడ్/ క్యామ్ - 10 పోస్టులు ఉన్నాయి.
◾️అసిస్టెంట్ ఆఫీసర్ (ఎఫ్ అండ్ ఏ) - 1 పోస్టు. దీన్ని ఎస్సీలకు కేటాయించారు.
◾️టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (టూల్రూమ్/ టెస్టింగ్/ ప్రాసెసింగ్/ డిజైన్ (క్యాడ్-క్యామ్ -సీఏఈ) - 20
పోస్టులు.
◾️అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 - 3 పోస్టులు 5) అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్ 3 - 4 పోస్టులు ఉన్నాయి.
◾️ ఈ రెండు పోస్టులూ నాన్-టెక్నికల్ గ్రూప్-సి విభాగానికి చెందినవి.
◾️అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (స్కిల్ డెవలప్మెంట్/ ప్రాసెసింగ్/ టెస్టింగ్/ డిజైన్/ టూల్రూమ్/ క్యాడ్/ క్యామ్ పోస్టుకు మెకానికల్/ కెమికల్/ పాలిమర్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్ ఫస్ట్ క్లాస్ పాసవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
◾️అసిస్టెంట్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) పోస్టుకు బీకామ్, ఎంబీయే (ఫైనాన్స్) ఫస్ట్ క్లాస్లో పాసవ్వాలి/ ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాసై మూడేళ్ల అనుభవం ఉండాలి. గవర్నమెంట్ ఫైనాన్షియల్ రూల్స్, బడ్జెట్, కాస్ట్ అకౌంటింగ్, బుక్ కీపింగ్, ఫైనాన్షియల్ బడ్జెట్స్, అకౌంట్స్ ఫైనలైజేషన్, ఫండ్స్ మేనేజ్మెంట్, ట్యాలీ/ ఎంఐఎస్/ఈఆర్పీ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
◾️టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (టూల్ రూమ్ / టెస్టింగ్/ ప్రాసెసింగ్/డిజైన్ పోస్టుకు క్యాడ్/క్యామ్తో మెకానికల్/ డీపీఎంటీ/ డీపీటీ/ పీజీడీపీటీక్యూసీ/ పీజీడీపీపీటీ/ పీడీపీఎండీ డిప్లొమా పాసై.. సంవత్సరం అనుభవం ఉండాలి. లేదా ఐటీఐ (ఫిట్టర్/ టర్నర్/ మెషినిస్ట్) పాసై రెండేళ్ల అనుభవం ఉండాలి.
◾️అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుకు గ్రాడ్యుయేషన్ 52 శాతం మార్కులతో పాసవ్వాలి. ఆఫీసు నిర్వహణలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ ఆపరేషన్స్, ఎంఎస్-ఆఫీస్, నోటింగ్, డ్రాఫ్టింగ్ నైపుణ్యం ఉండాలి.
◾️అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3 పోస్టుకు బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాసై..ట్యాలీ నాలెడ్జ్ ఉండి, రెండేళ్ల అనుభవం ఉండాలి. డైరెక్ట్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సేషన్, గవర్నమెంట్ పర్చేస్ ప్రొసీజర్స్, పీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. అన్ని పోస్టులకూ గరిష్ట వయసు 32 సంవత్సరాలు. రిజర్వేషన్ ఉన్న వారికి వయసులో సడలింపు ఉంటుంది.
◾️ఎంపికైన అభ్యర్థులను ఏడాదిపాటు ట్రెయినీగా నియమిస్తారు. ఆ తర్వాత రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది.
◾️దరఖాస్తుకు విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లను జతపరచి పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :
డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), సిపెట్ హెడ్ ఆఫీస్, టి.వి.కె. ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై- 600 032 అనే చిరునామాకు రిజిస్టర్డ్/స్పీడ్ పోస్టులో పంపించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ: 29/05/2023
👉వెబ్సైట్ : http://www.cipet.gov.in/