Type Here to Get Search Results !

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ...సిలబస్ వివరాలు...

👉అర్హత:
డిప్లొమా(జీఎన్ఎం)తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్ /బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ(పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.

👉మొత్తం పోస్టుల: నర్సింగ్ ఆఫీసర్ 3055

👉వయసు:
వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్లకు అయిదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉శాలరీ
నర్సింగ్ ఆఫీసర్ కొలువుకు ఎంపికైన వారికి పేస్కేల్ లెవల్ 7 ప్రకారం-వేతనాలు చెల్లిస్తారు. వీరు ప్రతి నెల రూ.44,900 మూల వేతనంగా పొందుతారు. దీనికి డీఏ, హెచ్ఎస్ఏ అదనంగా ఉంటాయి.

👉ఎంపిక విధానం: 
నర్సింగ్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్టు(ఎన్ఐఆర్ఎసెట్)లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో సాధించిన స్కోరు ఆరు నెలలు లేదా తర్వాత పరీక్ష వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యవధిలో కొత్తగా ఖాళీలు ఏర్పడితే ఈ స్కోరు ఆధారంగానే భర్తీ చేస్తారు. మొత్తం ఖాళీల్లో 80 శాతం మహిళలకు, 20 శాతం పురుషులకు కేటాయించారు.

*ఎన్ ఓ ఆర్ సెట్ అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అనంతరం మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం పోస్టులను భర్తీచేస్తారు. ఇలా కొలువులో చేరిన వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు.

👉అర్హత మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50శాతం, ఓబీసీలు - 45 శాతం, ఎస్సీ/ఎస్టీలు 40 శాతం అర్హత మార్కులుగా సాధించాలి.
దివ్యాంగులకు వారి కేటగిరిని అనుసరించి 5 శాతం మార్కుల సడలింపు లభిస్తుంది.

👉పరీక్ష విధానం:
*ఎన్ ఓ ఆర్ సెట్ ను ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలకు నిర్వహిస్తారు.
*పరీక్ష సమయం మూడు గంటలు.
* మొత్తం ప్రశ్నల్లో 180 సబ్జెక్టుకు సంబంధించినవి కాగా, మిగిలిన 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి వస్తాయి.
*ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. అలాగే తప్పు సమాధానానికి మార్కులో మూడోవంతు తగ్గిస్తారు.
* ఈ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.

👉సిలబస్:
ఈ పరీక్షలో సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు నాలుగేళ్ల బీఎస్సీ సిలబస్ ను క్షుణ్నంగా చదవాలి. అలాగే గతంలో నిర్వహించిన పరీక్ష పత్రాలను, ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను సాధన చేయాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారాదరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది: 05/05/2023

👉 సీబీటీ పరీక్ష తేదీ: 03/06/2023

👉వెబ్సైట్: https://norcet4.aiimsexams.ac.in/
Tags

Post a Comment

0 Comments