👉 దే శంలో విమానయాన రంగం దూసుకుపోతుంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో అందరూ వేగంగా తమ పనులు పూర్తి కావాలని భావిస్తున్నారు. దీంతో ఎంత దూరమైన తక్కువ టైంలో ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ జర్నీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారు.
👉 అదే సమయంలో ప్రపంచానికి ఇండియా మంచి మార్కెట్గా నిలుస్తోంది. ఇండియాలో విమానయాన రంగం అభివృద్ధి చెందడానికి ఇది మరో కారణం.
👉వీటి వల్ల వ్యాపార వృద్ధితో పాటు ఆతిథ్య రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
👉ప్రధానంగా ఎయిర్ పోర్ట్, హస్పిటాలిటీకి సంబంధించి జాబ్ లు పెరగడంతో పాటు ఆసక్తి ఉన్న వారికి బెస్ట్ కెరీర్ ఆప్షన్లు అవుతున్నాయి. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
👉 ఎయిర్పోర్ట్స్లో ఫుడ్ అండ్ బేవరేజస్ డిపార్ట్మెంట్లలో బోలెడు అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులను కలుసుకోవడం, వారితో మాట్లాడటం ఆసక్తి ఉన్న వాళ్లు ఇందులో ప్రయత్నించవచ్చు.
👉 ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వారికి అతిథ్యం ఇవ్వడమే మీ ప్రధానమైన విధి. నైపుణ్యాలకు తగ్గట్లు మంచి కెరీర్ ఉంటుంది.
👉 విమానాశ్రయాల్లో ఆతిథ్య రంగంలో ఉద్యోగాలకు కొదవే లేదు.
👉 ఎయిర్పోర్ట్స్ హాస్పిటాలిటీకి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ కాఫీబార్లు, కేఫ్ లు, ఫుడ్ తదితర సెక్షన్లలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
👉 ఈ విభాగాల్లో చెఫ్ లు , సర్వర్లు, బార్టెండర్లు, ఫుడ్ స్పెషలిస్టు తదితర విభాగాల్లో నిపుణులు అవసరం.
👉హొటల్ మేనేజ్మెంట్ చేసిన వారికి విమానయాన రంగం మంచి కెరీర్ ఆప్షన్ గా ఉంటుంది. ఎదుటి వారితో స్నేహంగా, ఆకట్టుకునేలా మాట్లాడే నైపుణ్యం మీకు ఉంటే ఈ రంగంలోకి మీరు రావచ్చు.
👉 ఎయిర్పోర్ట్స్లో కస్టమర్ సర్వీస్ విభాగంలో అవకాశాలు ఉంటాయి. డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులకు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తారు. కొత్తవారికి, అప్పుడప్పుడు మాత్రమే ప్రయాణాలు చేసేవారికి ఎయిర్పోర్ట్ సేవల గురించి ఏమాత్రం తెలియదు.
👉 అలాంటి ప్రయాణికులను బాగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, చెక్-ఇన్, బోర్డింగ్ ఇతర ప్రయాణ విషయాలకు సంబంధించి వారికి మీ సహాయం అవసరం అవుతుంది.
👉 ఈ రంగంలో మంచి అవకాశాలు ఉండటంతో పాటు కెరీర్ పరంగాను బాగుంటుంది.
👉 భారత్లో విమానాశ్రయ రంగం విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఇందులో భారీ అవకాశాలు ఉండనున్నాయి. ఇండియన్ ఎయిర్ పోర్ట్ హాస్పిటాలిటీ ప్రయాణీకులకు అత్యుత్తమ, అసాధారణమైన సేవలు అందించడానికి కట్టుబడి ఉందని ఎన్ కాల్మ్ హస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ & ట్రైనింగ్ హెడ్ మిలన్ ముఖర్జీ చెబుతున్నారు.
👉 లాంజ్లు, స్పాలు, వెల్నెస్ సెంటర్లలో అందించే సేవలకు ఉద్యోగులు అవసరం అవుతారు.
👉 ఇందులో ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నుంచి కస్టమర్ సర్వీస్ పొజిషన్ల వరకు అనేక అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మంచి స్కిల్ ఉన్నవారికి ఉన్నతస్థాయి పదవులు లభిస్తాయన్నారు.