Type Here to Get Search Results !

UPSC భారీ నోటిఫికేషన్ విడుదల - మొత్తం 1,105 పోస్టుల భర్తీ..

👉 IAS, IPS ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి UPSC భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,105 ఖాళీలను భర్తీ చేయనున్నది.

👉 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2023 నోటిఫికేషన్ను విడుదల చేసింది.

👉 ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుచున్నది.

👉 అర్హతలు:
💥 అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
💥  డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా అర్హులే.

👉 వయస్సు:
💥 అభ్యర్థుల వయసు 01-08-2023 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
💥 అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. అంటే 02-08-1991 నుంచి 01-08-2002 మధ్య జన్మించి ఉండాలి.
💥 రిజర్వ్డ్ కేటగిరీకి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ :
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 55,000 – 3,80,000 /- వరకు వస్తుంది.

👉 ఎంపిక విధానం:
రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం:
💥 అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఫీజు వివరాలు:
💥 ఓబీసీ / ఇతర అభ్యర్థులకు రూ.100
💥 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

👉 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం:
💥 ఫిబ్రవరి 01, 2023

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
💥 ఫిబ్రవరి 21, 2023

👉 దరఖాస్తు సవరణ తేదీలు:
💥 22.02.2023 నుంచి 28.02.2023 వరకు.

👉 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 28.05.2023.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥 https://www.upsc.gov.in/
Tags

Post a Comment

0 Comments