Type Here to Get Search Results !

స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - మొత్తం 5,204 పోస్టుల భర్తీ...

👉 తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా.. వైద్య, ఆరోగ్య శాఖ సహా మొత్తం తొమ్మిది శాఖల్లో 5,204 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖతోపాటు..

👉 తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లోనూ అక్కడి విద్యార్థులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో వాటిలోనూ స్టాఫ్ నర్స్లను నియమించనున్నారు.

👉 రాష్ట్రంలో వేల సంఖ్యలో అభ్యర్థులు నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసి.. ప్రైవేట్ హాస్పిటల్స్లో నర్స్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

👉 ఇలాంటి వారందరికీ ప్రభుత్వ కొలువు సొంతం చేసుకునే మార్గంగా తాజా నోటిఫికేషన్ నిలుస్తోంది.

👉 అర్హతలు:
💥 బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం అండ్ మిడ్ వైఫరీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉 వయసు:
💥 జూలై 1, 2022 నాటికి 18-44 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు).

👉 జీతం:
💥 36,570 - రూ. 1,06,990

👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఆన్లైన్ దరఖాస్తు తేదీలు:
💥 జనవరి 25 - ఫిబ్రవరి 15

👉 రాత పరీక్ష కేంద్రాలు:
💥 హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్.

👉 వెబ్సైట్:
💥 https://mhsrb.telangana.gov.in

👉 ఎంపిక విధానం:
💥 తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్.. నర్సింగ్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా.. రాత పరీక్ష, అప్పటికే అభ్యర్థులు పొందిన సర్వీస్ (పని అనుభవం) ఆధారంగా తుది విజేతలను ఖరారు చేయనుంది.
💥 రాత పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు.
💥 మరో 20 మార్కులకు అభ్యర్థుల పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని.. గిరిజన ప్రాంతాల్లో ఆరు నెలల సర్వీసు 2.5 పాయింట్లు చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో ఆరు నెలల సర్వీసు 2 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు.
💥 ఇలా.. ప్రతి ఆరు నెలల సర్వీసు పాయింట్లు కేటాయించే విధానంలో.. గరిష్టంగా 20 మార్కులను పని అనుభవానికి వెయిటేజీ కల్పిస్తారు.
💥 పని అనుభవం విషయంలో నిర్దిష్ట నిబంధనలను రూపొందించారు.
💥 అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రులు లేదా ఇన్స్టిట్యూట్స్, లేదా ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి విభాగాల్లో.. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తుండాలి. వారికే సర్వీస్ పాయింట్స్ వెయిటేజీ కల్పిస్తారు.
💥 అదే విధంగా సర్వీస్ అనుభవం పాయింట్లు పొందాలనుకునే వారు స్టాఫ్ నర్స్ హోదాలోనే విధులు నిర్వర్తించి ఉండాలి.
💥 దీంతోపాటు.. వారు పని చేసిన విభాగాల అధీకృత అధికారుల నుంచి సర్వీస్ సర్టిఫికెట్ను నిర్దేశిత నమూనాలో దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.

👉 అకడమిక్ నైపుణ్యాలు
💥 80 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థులు అకడమిక్ నైపుణ్యాలపై పట్టు సాధించాలి.
💥 జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ స్థాయిలో చదివిన అంశాలు, ప్రాక్టికల్స్క సంబంధించిన విషయాలను అవలోకనం చేసుకోవాలి.
💥 వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి సమకాలీన పరిస్థితులపైనా అవగాహన పెంచుకోవాలి.
💥 వీటిని సబ్జెక్ట్ అంశాలతో సమ్మిళితం చేసుకుంటూ.. బేరీజు వేసుకుంటూ అభ్యసనం చేస్తే మంచి మార్కులు సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

👉 రాత పరీక్ష విధానం:
💥 ఎంపిక ప్రక్రియలో కీలకంగా నిలిచే రాత పరీక్షను 80 ప్రశ్నలతో 80 మార్కులకు నిర్వహిస్తారు.
💥 ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా జరుగుతుంది.
Tags

Post a Comment

0 Comments