👉 తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) భారీగా ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది.
👉 తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. పరీక్షలను కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు నిరుద్యోగులకు ఊరటనిస్తూ..టీఎస్ఎస్ పీడీసీఎల్ మరో ప్రకటన చేసింది.. టీఎస్ఎస్పీడీసీఎల్లో ఖాళీగా ఉన్న 1,601 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ సంస్థ ఉద్యోగ ప్రకటన చేసింది.
👉 ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ఫిబ్రవరి 15న లేదా ఆ తర్వాత డీటెయిల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://www.tssouthernpower.com/ లేదా https://tssouthernpower.cgg.gov.in/ వెబ్సైట్లలో డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూడొచ్చు.
👉 పోస్టుల పూర్తి వివరాలు:
💥 జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటీస్ విడుదల చేసింది. మొత్తం 1,601 పోస్టులున్నాయి. అందులో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్మెన్ పోస్టులు 1553.
👉 విద్యా అర్హతలు:
💥 గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ప్రకారం జూనియర్ లైన్మెన్ పోస్టుకు 10వ తరగతి, ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్మెన్ ట్రేడ్ లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్లో ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్స్ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉 ఇక అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి.
👉 ఎంపిక విధానం:
💥 ఎంపిక విధానం చూస్తే ఇక జూనియర్ లైన్మెన్ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆర్టిజన్లకు, సంస్థలో పనిచేసే ఉద్యోగులకు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులకు రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
👉 శాలరీ వివరాలు:
💥 అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.64,295 బేసిక్ వేతనంతో మొత్తం రూ.99,345 వేతనం లభిస్తుంది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు రూ.24,340 బేసిక్ వేతనంతో మొత్తం రూ.39,405 వేతనం లభిస్తుంది.