👉 కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, యూనివర్సిటీల్లో ప్రస్తుతం 58,000కు పైగా టీచింగ్ (Teaching Post), నాన్-టీచింగ్ (Non-Teaching Post) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
👉 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalayas), జవహర్ నవోదయ విద్యాలయాలు (Jawahar Navodaya Vidyalayas), ఐఐటీలు (IITs), ఎన్ఐటీ(NITS)లతో పాటు మరిన్ని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
👉 ఈ విషయాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్సభలో ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానంగా ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించారు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ (Subhash Sarkar).
👉 కేంద్ర విద్యాశాఖలోని టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల వివరాలు ఇవే..
💥 కేంద్రీయ విద్యాలయాలు: 18,411
💥 నవోదయ పాఠశాలలు : 5,027
💥 సెంట్రల్ వర్సిటీలు : 21,978
💥 ఐఐటీలు : 9477
💥 ఎస్ఐటీలు, ఐఐఈఎస్ఓలు : 5862
💥 ఐఐఎసీసీ, ఐఐఎస్ఈఆర్: 978
💥 ఐఐఎంఎస్ : 1,050.
👉 బోధనకు ఇబ్బంది లేకుండా కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో కొందరు టీచింగ్, నాన్- టీచింగ్ సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించినట్టు తెలిపారు.
👉 పదవీ విరమణలు, పదోన్నతులు, అదనపు అవసరాల కారణంగా విద్యాసంస్థల్లో ఈ పోస్టుల ఖాళీలు ఏర్పడినట్టు కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.