👉 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా లక్షా పాతిక వేల నుంచి లక్షన్నర మంది వరకు ఎంప్లాయీన్ని తీసుకోనున్నట్లు TCS CEO and MD రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు.
👉 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
👉 2022 ప్రారంభంలో కంటే 2023 ప్రారంభంలో హైరింగ్ సెంటిమెంట్ ఆశాజనకంగా ఉంటుందని గోపీనాథన్ డిసెంబర్ నెలలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే.
👉 అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో TCS నుంచి 2 వేల మందికి పైగా ఉద్యోగులు వెళ్లిపోయారు. దీనికి కారణం డిమాండ్ లేకపోవటం కాదని స్పష్టం చేశారు.
👉 ఇంత భారీఎత్తున రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నామంటే సంస్థ భవిష్యత్ పట్ల తమకు ఎంత ప్రగాఢ విశ్వాసం ఉందో అర్థంచేసుకోవచ్చని చెప్పారు. ఇదిలాఉండగా..
👉 దాదాపు 40 వేల మంది ఫ్రెషర్స్కి అవకాశం ఇస్తామని TCS ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు CHRO మిలింద్ లక్కడ్ తెలిపారు.
👉 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు TCS.. 42 వేల మంది ఫ్రెషర్స్కి అవకాశం కల్పించింది. డిసెంబర్ క్వార్టర్లోనే 7 వేల మందికి ఉద్యోగం ఇచ్చింది.