👉 ప్రభుత్వరంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది.
👉 ఈ నోటిఫికేషన్ లో మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనున్నది.
👉 జాబ్ వివరాలు:
💥 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
💥 పోస్టుల సంఖ్య: 300
💥 అర్హత:ఏదైనా డిగ్రీ.
👉 వయోపరిమితి:
💥 01.01.2023 నాటికి 21- 30 సంవత్సరాల
మధ్య ఉండాలి.
💥 నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
💥 02.01.1993 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
👉 దరఖాస్తు ఫీజు:
💥 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.85,
💥 మిగిలినవారికి రూ.700,
💥 ఆన్లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.
👉 ఎంపిక విధానం:
💥 ప్రిలిమ్స్,
💥 మెయిన్స్
💥 ఆన్లైన్ పరీక్షలు,
💥 ఇంటర్వ్యూ,
💥 మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా
👉 ప్రిలిమినరీ పరీక్ష విధానం..
💥 మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
💥 వీటిలో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు- 35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు-35 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు.
💥 అయితే వీటిలో ఇంగ్లిష్ పరీక్షను (30 మార్కులు) కేవలం అర్హత పరీక్షగానే పరిగణిస్తారు. ర్యాంకింగ్లో ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
💥 దీంతో 70 మార్కులకే ప్రిలిమినరీ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష సమయం 60
నిమిషాలు.
👉 మెయిన్స్ పరీక్ష విధానం..
💥 మొత్తం 325 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో 120 పశ్నలకు 300 మార్కులు, డిస్క్రిప్టివ్ పరీక్ష (ఇంగ్లిష్)కు 25 మార్కులు కేటాయించారు.
💥 ఆబ్జెక్టివ్ పరీక్షలో రీజనింగ్ ఎబిలిటి నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలు-90 మార్కులు, ఇన్స్యూరెన్స్ & ఫైనాన్షియల్ మార్కెట్ అవెర్నెస్ నుంచి 30 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
💥 హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. 2 గంటల సమయం కేటాయించారు. ఇక డిస్క్రిప్టివ్ పేపరుకు 30 నిమిషాల సమయం కేటాయించారు.
👉 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
💥 January 15, 2023
👉 ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది:
💥 January 31, 2023
👉 ప్రిలిమినరీ పరీక్ష హాల్టికెట్ డౌన్లోడ్:
💥 పరీక్ష తేదికి 7-10 రోజుల ముందు నుంచి.
👉 ప్రిలిమినరీ పరీక్ష తేదీ:
💥 February 17, 2023 మరియు
February 20, 2023
👉 మెయిన్ పరీక్ష తేదీ:
💥 March 18, 2023
👉 డిగ్రీతో సంబంధిత విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉 అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.85 చెల్లిస్తే సరిపోతుంది.
👉 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
👉 ఐబీపీఎస్, ఎస్బీఐ పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు, గతంలో పరీక్ష రాసినవాళ్లు ప్రాథమిక పరీక్షలో సులభంగా రాణించవచ్చు.
👉 సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15 నుంచి 31 వరకు ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.