Type Here to Get Search Results !

DRDO: ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA),ఇతర విభాగాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DRDO Recruitment Notification: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డిఓ (DRDO), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ADA) విభాగాలలో ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం  ఖాళీలు: 152

👉సైంటిస్ట్-బి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (RAC) ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తు కోరుతున్నారు.

👉పోస్టులు - వివరాలు:
▪️డీఆర్డిఓలో సైంటిస్ట్-బి- 127 పోస్టులు
▪️ఏబీఏలో సైంటిస్ట్/ఇంజినీర్-బి- 9 పోస్టులు
▪️ఇతర రక్షణ సంస్థలలో ఎన్కాడెడ్ సైంటిస్ట్-బి- 16 పోస్టులు

👉వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

▪️ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్, సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్, గణితం, సివిల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటమోలజీ, బయోస్టాటిస్టిక్స్, క్లినికల్ సైకాలజీ, సైకాలజీ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

👉అర్హత: అభ్యర్థులు సబ్జెక్టులో వ్యాలిడ్ గేట్ స్కోర్తో పాటు ఇంజినీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పాసై ఉండాలి. లాస్ట్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.1,00,000/- జీతం వరకు వస్తుంది. 

👉దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. ఇతరులు రూ.100 /- ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: గేట్ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది:  జూలై 4,2025

👉Websitehttps://rac.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments