Type Here to Get Search Results !

RCF Ltd :10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RCF Ltd Recruitment Notification: టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ, ఇంజినీరింగ్ (కెమిస్ట్రీ/ఫిజిక్స్), డిప్లొమా (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ పాసైన అభ్యర్థులకు ఉద్యోగాలు.

👉రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని నవరత్న సంస్థ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల కోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద వివిధ కేటగిరీ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 74

👉రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. ఇందులో ఆపరేటర్ ట్రైనీ (కెమికల్), బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్-3, జూనియర్ ఫైర్ మెన్ గ్రేడ్-2, నర్స్ గ్రేడ్ 2, టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

👉పోస్టులు- ఖాళీల వివరాలు:
▪️ఆపరేటర్ ట్రైనీ (కెమికల్)- 54
▪️బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ III- 3
▪️జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ II- 2
▪️నర్స్ గ్రేడ్ II- 1
▪️టెక్నీషియన్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్)- 4
▪️టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 2
▪️టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్)- 8

👉విద్యార్హత: ఉద్యోగాలను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సటీ నుంచి సంబంధిత విభాగంలో టెన్త్ లేదా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఇంజినీరింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిప్లొమా పాసై ఉండాలి అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

👉వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఫిబ్రవరి 1 నాటికి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 35 ఏళ్లు, నర్స్ గ్రేడ్-2 పోస్టులకు 36 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 33 ఏళ్ల వయస్సు మించరాదు.

👉శాలరీ: ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ణయించారు. నెలకు ఆపరేటర్/టెక్నీషియన్ ట్రైనీ, నర్స్ గ్రేడ్ II పోస్టులకు రూ.46,300, బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ IIIకు రూ.42,100, జూనియర్ ఫైర్మెన్ గ్రేడ్ II ఉద్యోగానికి రూ.37,900 జీతం ఉంటుంది.

👉ఎగ్జామ్ సెంటర్స్: ముంబై, నాగపూర్

👉దరఖాస్తు ఫీజు: ఓబీసీ అభ్యర్థులకు రూ.700 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 5, 2025


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments