👉Prakasam District Recruitment Notification: ప్రకాశం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీ. అర్హులైన అభ్యర్థులు మార్చి 24లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు : 16
👉పోస్టులు- ఖాళీలు:
ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో...
▪️ఆడియోమెట్రిక్ టెక్నిషియన్-1
▪️ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 - 2
▪️అవుట్సోర్సింగ్ పద్ధతిలో థియేటర్ అసిస్టెంట్ - 3
▪️ఆఫీస్ సబార్డినేట్ - 2
▪️ పోస్టుమార్టం అసిస్టెంట్- 2
▪️ జనరల్ డ్యూటీ అటెండంట్- 6 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
👉అర్హతలు: పోస్టులను అనుసరించి అర్హతలు ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, గ్రాడ్యుషన్ తదితర అర్హతలు ఉన్నాయి.
👉వయస్సు : 2024 జూలై 1 నాటికి వయస్సు 42 ఏళ్లలోపు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వయస్సు దాటకూడదు.
👉పోస్టులు - శాలరీ వివరాలు:
1. ఆడియోమెట్రిక్ టెక్నిషియన్ పోస్టుకు- రూ.32,670/-
2. ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్-2 పోస్టులకు- రూ.32,670/-
3. థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు- రూ.15,000/-
4. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు- రూ.15,000/-
5. జనరల్ డ్యూటీ అటెండంట్ పోస్టులకు- రూ.15,000/-
7. పోస్టుమార్టం అసిస్టెంట్ పోస్టుకు- రూ.15,000/-
👉దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులకు రూ.500 ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.300 ఉంది.
▪️ఫీజును "District Coordinator of Hospital Services, APVVP, Ongole" పేరుపై డీడీ తీయాలి. ఆ డీడీని అప్లికేషన్కు జతచేయాలి.
👉దరఖాస్తు ఫామ్ ను అధికార వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థి వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, ఉద్యోగ అనుభవాలతో కూడిన జిరాక్స్ కాపీ సెట్ ను Specified Counters in O/0 DCHS, PRAKASAM" మార్చ్ 24వ తేది సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది.
👉కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు.
1. పదో తరగతి మార్కుల జాబితా
2. పోస్టులకు సంబంధించిన అర్హత సర్టిఫికెట్
3. అర్హత పరీక్షకు హాజరైన ఆధారం
4. అన్ని సంవత్సరాలు మార్కుల లిస్టులు
5. ఏపీ పారామెడికల్ బోర్డు, అలైడ్ హెల్త్ కేర్ సైన్స్, ఇతర కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
6. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
7. కుల ధ్రువీకరణ ప్రతం
8. దివ్యాంగు అభ్యర్థులు సదరం సర్టిఫికేట్
9. సర్వీస్ సర్టిఫికెట్
10. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: