Type Here to Get Search Results !

Job Mela:10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ...


👉ఈ నెల 14వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి భీమడోలులోని గీతాంజలి ఇంటర్, డిగ్రీ కళాశాల ఆవరణలో ఉద్యోగాల భర్తీకై ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు, కళాశాల కరస్పాండెంట్ ఎం.గౌతమ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ సత్యనారాయణ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

👉భీమడోలు మండలం అంబరుపేటలోని లిక్సిల్ ఇండియా శానిటరీవేర్ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్టుమెంట్లో పనిచేసేందుకు మహిళల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

👉పదో తరగతి పాసై, 20 ఏళ్లు పైబడిన మహిళలు ఇందుకు అర్హులుగా పేర్కొన్నారు.

👉అలాగే వెల్డర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో అప్రెంటీస్గా పనిచేసేందుకు 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు హాజరుకావాలన్నారు.

👉 ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కాపీ, పాస్పోర్టు సైజు ఫొటోలతో నేరుగా హాజరుకావాలని కోరారు.

👉పూర్తి వివరాలకు సెల్ 88868 82032లో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి సి.మధుభూషణరావు తెలిపారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments